12 June, 2026 | 1:09 AM

నెలాఖరులో కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

12-06-2026 12:00 AM

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జూన్ 11 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలాఖరులో ప్రారంభిస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కలెక్టరేట్ నూతన భవనం పనులు పూర్తి కావడంతో గురువారం మంత్రి పొన్నం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవనానికి గతంలో నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ చాలా పనులు మిగిలిపోయి పరిస్థితి ఉండేదని, జిల్లా కలెక్టర్‌గా చిత్ర మిశ్రా బాధ్యతలు స్వీకరించిన తరువాత భవన నిర్మాణం పై ప్రత్యేక శ్రద్ధ చేపట్టారన్నారు. మిగిలిపోయిన పనులపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టరేట్ కార్యాలయంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహా విష్కరణ చేస్తారని, జాతీయ జెండా ఆవిష్కరిస్తారన్నారు.

భవనం ప్రారంభం తర్వాత జిల్లా కేంద్రంలో ఉన్న సమీకృత కార్యాలయాలు ఇతర భవనాలు కూడా ఉపయో గించడం జరుగుతుందన్నారు. పాత భవనానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించి దానిని కూడా ఇతర కార్యాలయాలకు ఉపయోగించుకోవచ్చు అన్నారు. కలెక్టరేట్ కట్టే సమ యంలో  జిల్లా అధికారులకు ప్రత్యేకించి నివాస గృహాలు కట్టే కార్యాచరణ ఉండే కానీ ఇప్పటికే గతంలో నిర్మించిన జిల్లా అధికారుల నివాస గృహాలు సరిపోతాయన్నా రు. నూతన కలెక్టరేట్ కార్యాలయంలో గ్రీన రీ, ల్యాండ్ స్కెప్ సుడా ఆధ్వర్యంలో చేయడం జరిగిందన్నారు.

కరీంనగర్ కలెక్టరేట్‌కి  ప్రజలు రావడానికి, పోవడానికి ఇబ్బంది లేకుండా దారి విస్తరించడం జరుగుతుందన్నారు.  నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లు, రాబోయే కాలం లో కొత్త పెన్షన్లు, మున్సిపల్ అంశాలు  పరిపాలన కేంద్రంగా రాష్ట్రంలోనే జిల్లా అగ్రగా మిగా ఉండాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ గడ్డ అగ్రగామిగా ఉంచుతా మని తెలిపారు. టూరిజం ఇండస్ట్రీ తో పాటు ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు.

శాతవాహన యూనివర్సిటీ ఉందని, లా కాలేజీ, ఫార్మసీ కాలేజీ తీసుకొచ్చామన్నారు. హెల్త్‌హబ్‌గా మెడికల్ కాలేజీ ఉందని, టీచింగ్ హాస్పిటల్‌గా అప్గ్రేడ్ చేయడం జరిగిందన్నారు. జిల్లా అభివృద్ధికి తాను, మంత్రులు శ్రీధర్ బాబు,అడ్లూరి లక్ష్మణ్ శాసన సభ్యులతో కలిసి చేస్తున్నామన్నారు. హెలిప్యాడ్ గ్రౌండ్ వినియోగంలోకి తేవడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో శాతవాహన యూనివర్సిటీ కాలేజీ ప్రోగ్రామ్స్, మున్సిపల్, ఇతర శాఖల అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారన్నారు.

మానేరు రివర్ ఫ్రంట్ మేము వచ్చిన తర్వాతనే సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసామని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ తీగల వంతెన ఏమైందని ప్రశ్నించారు. డంప్ యార్డు తరలింపు నకు  కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కోరామని, కేంద్ర మంత్రి కట్టర్ వచ్చినప్పుడు డంప్ యార్డు తరలించాలని విజ్ఞప్తి చేశామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రా, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.