నిప్పులు చెరిగిన ఇంగ్లండ్
22-08-2024 12:30 AM
మాంచెస్టర్: స్వదేశంలో శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ బౌల ర్లు నిప్పులు చెరిగారు. మాంచెస్టర్ వేదికగా మొదలైన తొలి టెస్టులో శ్రీలంక తొలి ఇన్ని ంగ్స్‌లో 236 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ డిసిల్వా (84 బంతుల్లో 74) అర్థసెంచరీతో రాణించగా.. తొలి టెస్టు ఆడుతున్న మిలన్ ప్రియాంత్ (72) ఆకట్టకున్నాడు. వీరిద్దరు మినహా మిగతావారంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్‌లు చెరో 3 వికెట్లు పడగొట్టగా.. అకిన్‌సన్ రెండు వికెట్లు తీశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక ఆరంభం నుంచే తడబడింది.






