తడబడ్డా నిలబడ్డారు
పాక్, బంగ్లా తొలి టెస్టు
రావల్పిండి: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్లు తొలుత తడబడినప్పటికీ ఆపై నిలబడ్డారు. వర్షం అంతరాయంతో ఆలస్యంగా ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 41 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. క్రీజులో షకీల్ (57), రిజ్వాన్ (24) ఉన్నారు. బంగ్లా బౌలర్లలో ఇస్లాం, మహముద్ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకముందు వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్ చిత్తడి గా మారడం వల్ల టాస్ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో తొలి రెండు సెషన్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మధ్యాహ్నం 2.30 గంటలకు మూడో సెషన్‌లో మ్యాచ్ ప్రారంభమైంది. ఆ ఒక్క సెషన్లోనే 41 ఓవర్ల పాటు ఆట సాగింది. బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు 20 పరుగుల లోపే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ షఫీక్ (2), కెప్టెన్ మసూద్ (6), మాజీ కెప్టెన్ బాబర్ అజం డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచారు.






