సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ ఓటమి
ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్
నూఢిల్లీ, మే 30 : ఆసియా గేమ్స్‌లో పాల్గొని పతకం సా ధించాలనుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశే మిగిలింది. ఆసియా క్రీడల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో వినేశ్ పరాజ యం పాలైంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాం ధీ స్టేడియంలో జరిగిన మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో వినేశ్ ఫొగాట్ 4- తేడాతో మీనాక్షి గోయత్ చేతిలో పరా జయం చవిచూసింది. ఇద్దరూ హోరాహోరీగా తలపడడంతో ఔట్ ఉత్కంఠగా సాగిం ది. చివరికి వినేశ్‌పై మీనాక్షి పైచేయి సాధించింది.
ఈ ఓటమితో వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడల 2026 ఎంపిక ట్రయల్స్ నుంచి వినేశ్ నిష్క్రమించింది. ట్రయల్స్‌లో బాగా రాణిం చి, అంతర్జాతీయ స్థాయిలో పునరాగమనం చేయాలన్న వినేశ్ ఆశలకు బ్రేక్ పడినట్టయిం ది. , అలాగే ఈ ఏడాది చివర్లో జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్న ఆసియా క్రీడలలో స్థానం సంపాదించుకోవాలన్న ఆమె అవకాశాలకు బ్రే క్ పడినట్లయింది. ఆసియా క్రీడల ట్ర యల్స్‌లో పాల్గొనేందుకు సుప్రీంకో ర్టు వరకూ వెళ్లి పోరాడి విజయం సాధించిన వినేశ్ అసలు పోటీలో మాత్రం నిరాశపరిచింది.
అయితే టయల్స్‌లో ఓట మి అనంతరం వినేశ్ ఫొగాట్ కీలక వ్యాఖ్య లు చేసింది. నేను ఓడిపోలేదు. ఈ వ్యవస్థతో ఒంటరిపోరాటం చేస్తున్నా. ప్రతిదాని కోసం పోరాడాల్సి వస్తోంది. నాకు న్యాయం జరగలేదు. మళ్లీ తిరిగి వస్తానని వ్యాఖ్యానించింది. ఆమెకు తొలుత రెజ్లింగ్ సమాఖ్య సె లక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అవకా శం ఇవ్వలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట దక్కింది. అటు రెజ్లింగ్ సమాఖ్య హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అక్కడ కూడా వినేశ్‌కే అనుకూలతీర్పు వచ్చింది.






