calender_icon.png 20 May, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘన జీవామృతంతో భూసారం పెంపు

19-05-2025 06:43:00 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఘన జీవామృతంతో భూసారం పెంపొందుతుందని, స్థానిక వనరులతో ఘన జీవామృతం తయారీపై ఓ స్వచ్ఛంద సంస్థ రైతులకు మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. 10 కిలోల పేడ, రెండు లీటర్ల ఆవు మూత్రం, ఒక కిలో శనగపిండి, ఒక కిలో నల్ల బెల్లం కలిపి పిడకలు తయారు చేసి నీడలో ఆరబెట్టి వాటిని పొడిచేసి విత్తనాలు వేయడానికి ముందు భూమిలో చల్లడం ద్వారా భూసారం పెంపొందుతుందని చెప్పారు.

అలాగే విత్తనాలు నాటిన తర్వాత కూడా మొక్క మొదలలో అడుగుభాగాన వేయడం వల్ల మొక్క ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందుతాయని జీవన్ ఆధార్ డైరెక్టర్ శక్రుబాయి తెలిపారు. అందుబాటులో ఉన్న సహజ వనరుల ద్వారా భూసారం పెంపు కోసం కృషి చేయాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రసాయన ఎరువులు వినియోగం తగ్గించవచ్చని చెప్పారు.