2 July, 2026 | 12:27 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

ప్రైవేటు వద్దు... ప్రభుత్వ పాఠశాలే ముద్దు

08-06-2025 06:57 PM

వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేష్..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ప్రైవేటు పాఠశాల వద్దు.. ప్రభుత్వ పాఠశాలే ముద్దు అని, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి ఉన్నతికి తోడ్పడాలని వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి మల్లేష్(Teachers Association District President Mallesh) కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండల కేంద్రం అర్వపల్లితో పాటు అడివెంల గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ తో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుతుందని తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కోటమర్తి వీరన్న, రమేష్, తల్లిదండ్రులు బత్తుల ఉపేందర్, వజ్జె నాగరాజు, ఉడుగు వెంకన్న, అన్నెపర్తి వెంకన్న, రాములు, యాదగిరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.