23 July, 2026 | 1:37 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన సర్పంచ్ చిరంజీవి

23-07-2026 01:02 PM

బెజ్జూర్ జూలై 23 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కుకిడ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులకు సర్పంచ్ చిరంజీవి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుండి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ తొర్రెం చిరంజీవి అందజేశారు. ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.