calender_icon.png 14 July, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్‌రావు అరెస్టు అప్రజాస్వామికం

06-12-2024 01:20:38 AM

  1. కాంగ్రెస్‌ది నిర్బంధ పాలన
  2. ప్రభుత్వ వైఖరిని ఖండించిన బీఆర్‌ఎస్ నేతలు

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాం తి): మాజీ మంత్రి హరీశ్‌రావు అరెస్టు అపప్రజాస్వామికమని, కౌశిక్‌రెడ్డిని తానే పోలీ సుస్టేషన్‌కు తీసుకొస్తానని చెప్పినా పోలీసు లు అరెస్టు చేయడం దారుణమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గురువా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందో కాం గ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్‌రెడ్డి అరెస్టుపై ప్రశ్నించిన హరీశ్‌రావును కూడా అరె స్టు చేయడం నీతిమాలిన చర్య అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

పోలీసు శాఖ డీజీపీకి బదులు సీఎం రేవంత్‌రెడ్డి కుటుం బం చేతిలో ఉందని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తే అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక లేకుండా చేయాలనే క్రమంలోనే హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్బంధ పాలన చేస్తోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రజాపాలన పేరుతో నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేధావులు అక్రమ అరెస్టులపై స్పందించాలని, ప్రజాస్వామ్యాన్ని లూటీ చేస్తున్న ఈప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు.