6వ తరగతి ప్రవేశానికి మార్చి 29న పరీక్ష
గుండాల, మార్చి 26 (విజయక్రాంతి): ఏకలవ్య మోడల్ రెసిడెన్సీయల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు మార్చి 29 న పరీక్ష నిర్వహించబడుతుందని గుండాల ఏకలవ్య మోడల్ రెసిడెన్సీయల్ స్కూల్ ప్రిన్సిపాల్ నితిన్ సింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని, పరీక్షకు హాజరయ్యే సమయంలో తప్పకుండా తమ వెంట తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గండుగులపల్లి (ఈఎంఆర్‌ఎస్), పాల్వంచ (ఈఎంఆర్‌ఎస్) టీజీ టీడబ్ల్యూయూ ఆర్జేసీ (భద్రాచలం) మూడు సెంటర్లలో మార్చి 29 ఆదివారం ఉదయం 10.30 నుండి 12.30 నిమిషముల వరకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారని దరఖాస్తు చేసిన విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.




