calender_icon.png 16 June, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభతోనే ప్రవేశం

12-06-2025 12:18:20 AM

- మూడు క్రీడా పాఠశాలల ప్రవేశాలకు కసరత్తు...

- 16 నుంచి మండల స్థాయి.. 23 నుంచి జిల్లా స్థాయిలో

- జూలై 1 నుంచి రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు

మంచిర్యాల, జూన్ 11 (విజయక్రాంతి) : క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా రాణించేలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట లాంటి మూడు క్రీడా పాఠశాలల్లో 2025 విద్యా సంవత్సరానికి నాలుగవ తరగతిలో ప్రవేశాలు భర్తీ చేసేందుకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (సాట్స్) ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 19 వరకు మండల స్థాయిలో, ఈ నెల 23 నుంచి 27 వరకు జిల్లా స్థాయిలో, జూలై ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి ఎంపిక చేయనున్నారు. చదువుతోపాటు ఆటల్లోనూ రాణించేలా శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రవేశాలకు అర్హతలు ఇవే...

4వ తరగతి చదువుతున్న బాల, బాలికల వయస్సు 8- సంవత్సరాలు ఉండాలి. (01.09.2016 నుంచి 30.08.2017 మధ్య జన్మించి ఉండాలి.) అర్హత పరీక్షకు వచ్చే వారు వయస్సు, స్టడీ సర్టిఫికెట్స్ (ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి), పుట్టిన తేదీ సర్టిఫికెట్, 10 లేటెస్ట్ పాస్ఫోర్ట్ సైజ్ ఫొటోలు, మూడు, నాలుగవ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ కాపీలు, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి. 

ఎంపికకు నిర్వహించే పరీక్షలు ఇవే..

మూడు అంచెల విధానం ద్వారా అంటే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఎంపికలలో తొమ్మిది అంశాల ప్రాతిపదికన పోటీ పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఒక్కో అంశానికి మూడు మార్కుల చొప్పున 27 మార్కులకుగాను ఫిజికల్ పరీక్షలు నిర్వహిస్తారు. క్రీడా పోటీలన్నింటిని తక్కువ సమయంలో చేదిస్తే అదనపు పాయింట్లు ఇస్తా రు. ఎంపికైతే అన్ని వసతులతో విధ్యతోపా టు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేలా ప్రోత్సాహం అందించ నున్నారు.

3 పాఠశాలలు.. 120 సీట్లు..

రాష్ట్రంలోని మూడు క్రీడా పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు 40 (బాలురు 20, బాలికలు 20) చొప్పున మొత్తం 120 సీట్లు ఉన్నా యి. వీటిలో బాలురు, బాలికలకు సగం చొప్పున సీట్లు కేటాయించారు. ఒక్కో క్రీడా పాఠశాలలో 15 విభాగాలలో 80 చొప్పున సీట్లు ఉన్నాయి. విద్యార్థికి ఇష్టమైనా లేదా వారి శరీరాకృతినిబట్టి అథ్లెటిక్, జూడో, బాక్సింగ్, విలువిధ్య, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్, వెయిట్ లిఫ్టింగ్, సెయిలింగ్, రోయింగ్, వాలీబాల్, ఫెన్సింగ్, సెపక్క్రా, కాయాకింగ్, యోగా తదితర క్రీడాంశాలలో శిక్షణ ఇస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ మైంది. విద్యార్థి ని, విద్యార్థులు మొబైల్ నుంచి వెబ్ సైట్ (https:// tgss.telangana.gov.in)లో వివరా లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ప్రత్యేక క్యూ ఆర్ కోడ్‌ను రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉంచాం. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 23 నుంచి 26 వరకు మంచిర్యాల జడ్పీహెచ్‌ఎస్ గ్రౌం డ్‌లో జరిగే ఎంపిక పోటీలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం బాక్సింగ్ కోచ్ రాజేష్ (99635 39234)లో సంప్రదించవచ్చు.

 గుర్రాల హనుమంత రెడ్డి, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి, మంచిర్యాల