calender_icon.png 7 July, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ ప్రేమికులం కావాలి!

22-04-2025 12:00:00 AM

నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న యావత్ ప్రపంచం ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని’ జరుపుకొంటుంది. అయితే, ఇది కేవలం ఒక సంబురం మాత్ర మే కాదు. మన ఉమ్మడి గృహమైన భూ మాతపట్ల మనకున్న అవిభాజ్యమైన బాధ్యతను గుర్తు చేసే ఒక మహోన్నత కా ర్యక్రమం. భారతదేశం విశాలమైన భౌగోళిక వైవిధ్యం, అనేక సంస్కృతుల సమా హారంతో శరవేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నది. అందువల్ల ఈ రోజుకు సంబంధించిన అంతర్లీన ప్రాముఖ్యాన్ని మరింత లోతుగా అవగాహన పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడాది ప్రపంచ ధరణీ దినోత్సవ ఇతివృత్తం భారతదేశానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని కల్పిస్తున్నది. 

సహజ వనరులకు నెలవు

మన దేశం అపారమైన సహజ వనరులు, జీవ వైవిధ్యానికి నెలవు. హిమాల యాల మంచు శిఖరాల నుంచి దక్షిణాన విస్తరించి ఉన్న ఉష్ణమండల అడవుల వర కు, అలాగే పశ్చిమాన ఉన్న ఎడారి ప్రాం తం నుంచి తూర్పున చిత్తడి నేలల వరకు భారతదేశం ఒక ప్రత్యేకమైన పర్యావరణ వైవిధ్యాన్ని కలిగి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి ప్రజల జీవనోపాధికి ఇదే మూలాధారం. అయితే శరవేగ అభివృద్ధి, పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ కారణంగా ఈ సహజ వనరులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

ఈ క్రమంలో పర్యావరణ పరంగా ఇప్పటికే దేశానికి అనేక దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయి. ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదల, అస్తవ్యస్త వర్షపాతం, కరువు కాటకాలు, ఆక స్మిక వరదలు వంటివి వ్యవసాయంతోపా టు నీటి వనరులు, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భూగ ర్భ జలాలు క్షీణిస్తుండటంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వాయు కాలుష్యం ముఖ్యంగా నగరాల్లోని ప్రజల ఆరోగ్యంపై విపరీతంగా ప్రభావం చూపుతోంది. 

‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని’ ఒక్కరోజు జరుపుకొని చేతులు దులుపేసుకుంటే సరిపోదు. పర్యావరణాన్ని కాపాడటం అనేది నిరంతరం కొనసాగాలి. మనందరం ప్రతి రోజూ భూమిని ప్రేమించాలి. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పర్యావరణాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఇది మన సహజ వారసత్వాన్ని పరిరక్షించడానికి, పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి, స్థిరమైన అభివృద్ధి మార్గంలో ముందుకు సాగడానికి ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం.

అడవుల నిర్మూలన, సహజ ఆవాసాల విధ్వంసంతో జీవ వైవిధ్యం ప్రభావితమవుతున్నది. అనేక జాతులు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. ప్లాస్టిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యాన్ని గుర్తు చేసుకోడానికి, స్థిరమైన అభివృద్ధి కోసం ఒక నూతన మా ర్గాన్ని రూపొందించుకోవడానికి ఈ ఏడా ది ప్రపంచ ధరణీ దినోత్సవం భారతదేశానికి  వేదికగా మారాల్సిన అవసరం ఉంది. 

అవరోధాలను అధిగమించాలి

భారతదేశం పునరుత్పాదక శక్తి రం గంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. సౌర, పవన, జలశక్తి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రా రంభించింది. ఈ ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలి. పర్యావరణ సవాళ్లను  పరిష్కరించడానికి ఒక సమగ్ర బ హుముఖ విధానం అవసరం. వ్యక్తిగత స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చు.

నీ టి సంరక్షణ, నిర్వహణ అత్యంత ముఖ్యమైన అంశం. సరైన పద్ధతులను అనుస రించి నీటిని సంరక్షిస్తే నీటి కొరతను పరిష్కరించవచ్చు. నదులు, ఇతర జల వన రుల కాలుష్యాన్ని నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే, వా యు కాలుష్యాన్ని తగ్గించడానికి పరిశ్రమల్లో పటిష్టమైన ఉద్గార నియంత్రణలను అమలు చేయడం, ప్రజా రవాణాను ప్రో త్సహించడం చాలా ముఖ్యం.

జీవ వైవిధ్య పరిరక్షణకు, వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు తగ్గించడానికి అడవులను కాపా డటం, అటవీ ప్రాంతాన్ని పెంచడం చాలా అవసరం. సామాజిక అటవీకరణ కార్యక్రమాలను ప్రోత్సహించడం, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అరణ్యాల  సంరక్షణ చేపట్టడం వంటి కార్యక్రమాలు అమలుచేస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించడానికి వాటి వినియోగం తగ్గించి, రీసైక్లింగ్ పద్ధతులను ప్రోత్సహించాలి. ప్లాస్టిక్‌కు స్థిరమైన ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయాలి. 

అలాగే వ్యర్థాల  నిర్వహణ, తొలగింపు కోసం సరైన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ఇళ్లు, కర్మాగారాలు, రవాణా రంగంలో ఇంధన శక్తిని పొదుపుగా ఏర్పాటు చేయా లి. ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిల్ వాడకాలను విరివిగా ప్రోత్సహించాలి. వాతావర ణ మార్పులను తట్టుకునే విధంగా పంటలను అభివృద్ధి చేయాలి. చెరువులు, కుంట లు వంటి నీటి వనరులను పునరుద్ధరించడం ద్వారా ద్వారా వర్షపు నీటిని ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకోవచ్చు. ప్రాంతీయ అవసరాలకు తగ్గట్టు చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టాలి.

తక్కువ నీటితో పండే పంటలను అభివృద్ధి చేయాలి. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటిని శుద్ధి చేయకుండా నదులు, ఇతర నీటి వనరుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఎరు వులు, పురుగు మందుల వాడకం తగ్గించి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడటం కోసం వన్యప్రాణుల నివాస స్థలాలను సంరక్షించాలి. వేటను అరికట్టాలి.   వ్యర్థాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే సాంకేతికతను మరింతగా అభివృద్ధి చేయాలి. 

అంతా మన చేతుల్లోనే ఉంది!

ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరు చేయ డం ద్వారా వ్యర్థాల నిర్వహణ మెరుగ్గా చేపట్టవచ్చు. పాఠశాల స్థాయినుంచే పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను విద్యా ర్థులకు తెలియజేయాలి. ఈ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మీడి యా, ఇతర వేదికలను సాధ్యమైనంతమేర ఉపయోగించాలి. ప్రకృతి సంరక్షణ కార్యక్రమాల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.

ప్రభుత్వాలు కఠినమైన పర్యావరణ చట్టాలను రూపొందించి, వా టిని సమర్థవంతంగా అమలు చేయాలి. పర్యావరణ పరిరక్షణ కోసం డబ్బులు కేటాయించి పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు ఇతర దేశాలతో కలిసి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఈ ఏడాది ‘ధరిత్రీ దినోత్సవం’ సందర్భంగా ఈ దిశగా ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సి ఉంది.

‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని’ ఒక్కరోజు జరుపుకొని చేతులు దులుపేసు కుంటే సరిపోదు. పర్యావరణాన్ని కాపాడటం అనేది నిరంతరం కొనసాగాలి. మనందరం ప్రతి రోజూ భూమిని ప్రేమించాలి. దాన్ని రక్షించడానికి ప్రతి క్షణం ప్రయత్నించాలి. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పర్యావరణాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

ఇది మన సహజ వారసత్వాన్ని పరిరక్షించడానికి, పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవ డానికి, స్థిరమైన అభివృద్ధి మార్గంలో ముందుకు సాగడానికి ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. బృహత్ సంకల్పం, సహకార స్ఫూర్తి, సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశం ఈ లక్ష్యాలను సాధించగలదు. ఈ క్రమంలోనే ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదు. ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని భూమిని గౌరవిస్తూ, దానిని భావితరాల కోసం సంరక్షించడానికి మన వంతుగా కృషి చేస్తామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం.

 వ్యాసకర్త: డి.జె. మోహనరావు, సెల్: 8247045230