6 June, 2026 | 1:40 AM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

06-06-2026 12:00 AM

గట్టు జూన్ 5: గట్టు : ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏసీబీఐ ఫౌండేషన్ భవిష్ భారత్ ఆదర్శం లో అంతపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం గ్రామస్తులు పవర్ పాయింట్ ద్వారా పరివరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

అనంతరం గ్రామాలలో మొక్కలు నాటి నిధులతో విద్యార్థులు గ్రామస్తులు  కలిసి ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన హరిత వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరికి బాధ్యత అని అందరూ మొక్కలు నాటి సురక్షించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు రంగన్న సర్పంచ్ దానయ్య మాజీ ఎంపీటీసీ వార్డ్ సభ్యులు భవిష్యత్ భారత్ ప్రాజెక్టు,ఇందు మైత్రి, హయం సిబ్బంది దాసు యశోద అరుణ గ్రామస్తులు పాల్గొన్నారు