6 June, 2026 | 1:41 AM

సీఎం దిష్టిబొమ్మ దహనం

06-06-2026 12:00 AM

బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్టులు

నాగర్ కర్నూల్ జూన్ 5 (విజయక్రాంతి)  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు బిఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్టు ఉద్రిక్తతకు దారి తీసింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తిమ్మాజిపేట, బిజినపల్లి, నాగర్ కర్నూల్, తాడూర్, తెలకపల్లి మండల కేంద్రాల్లో ఆ పార్టీ కార్యకర్తలను నేతలను తెల్లవారుజాము నుంచే ముందస్తు అరెస్టు చేశారు.

అందుకు నిరసిస్తూ తిమ్మాజిపేట మండల కేంద్రంలో అ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయా మండల కేంద్రాల్లో ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు బిఆర్‌ఎస్ కార్యకర్తలను పోకేసులు అరెస్టు చేసే క్రమంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.