26 August, 2026 | 3:23 AM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

26-08-2026 01:56 AM

 ఎమ్మెల్యే జారె 

అశ్వారావుపేట, ఆగస్టు 25 ( విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వంఅటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట శాసనసభ్యులు  జారె ఆదినారాయణ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు కూడా స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి గ్రామంలో పచ్చదనం పెరిగేలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, తమ ఇళ్ల పరిసరాల్లో, పాఠశాలల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.   సర్పంచ్ సత్యం లక్ష్మి కుమారి, ఉప సర్పంచ్ సాదు జోషి, మండల అధ్యక్షుడు చెన్నం శెట్టి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కోవా సి దుర్గారావు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంక వల్లి వీరభద్రరావు పాల్గొన్నారు.