26 August, 2026 | 3:30 AM

చరిత్ర గమనాన్ని మార్చే శక్తి ఫొటో జర్నలిస్టులకు ఉంది..

26-08-2026 01:56 AM

ముషీరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఫోటోజర్నలిస్టులు తీసే ప్రతి చిత్రం చారిత్రక రికార్డులో భాగమై, చరిత్ర గమనా న్ని మార్చే శక్తిని కలిగి ఉంటుందని మాజీ మంత్రి, పొన్నాల ఫౌండేషన్ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్ల బ్ లో తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల స ంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ వార్తా చిత్రాల ప్రదర్శన2026ను మంగళవా రం ఆయన తిలకించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వాస్తవ సంఘటనలను ప్రజలకు చూపించడంలో, వాస్తవాలను నిరూపించడంలో, అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడంలో ఫోటోజర్నలిజం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి హరి, ఉపాధ్యక్షులు కిషోర్ సింగ్, రామ్మూర్తి, కోశాధికారి అనిల్ కుమా ర్, కార్యవర్గ సభ్యులు హరికృష్ణ, మహేష్ కుమార్, శివకుమా ర్, నగర గోపాల్, నాయకులు పవన్ కు మార్, బషీర్, సుమన్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.