పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: జీఎం చింతల శ్రీనివాస్
- ఘనంగా మాస్ ప్లాంటేషన్ డ్రైవ్
- 10 వేల మొక్కలు నాటిన సింగరేణి, అధికారులు కార్మికులు
సత్తుపల్లి జూలై21( విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగరేణి జిఎం చింతల శ్రీనివాస్ అన్నారు.బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు, సింగరేణి యాజమాన్య సూచనలతో సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు పార్కింగ్ యార్డ్ ప్రాంగణంలో భారీ స్థాయిలో ‘మాస్ ప్లాంటేషన్ డ్రైవ్’ కార్యక్రమాన్ని ఘనంగా మంగళవారం నిర్వహించారు. సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏరియా వ్యాప్తంగా 10 వేల మొక్కలను నాటే లక్ష్యంతో విస్తృత స్థాయిలో వృక్షారోపణ చేపట్టారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఉద్యోగి, కార్మికుడు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు, పర్యావరణ విభాగం ప్రతినిధులతో పాటు ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఎస్. సుధాకర్, ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ బి. కోటేశ్వరరావు, సి ఎం ఓ ఏ ఐ వైస్ ప్రెసిడెంట్ డి. రమేష్ బాబు పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో సింగరేణి యాజమాన్యానికి తమ పూర్తి సహకారం ఉంటుందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, సత్తుపల్లి ఏరియాను మరింత హరితమయంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు,యూనియన్ సంఘ బాధ్యులు ,కార్మికులు ఉన్నారు.






