అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
- బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలి
- సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
లక్ష్మీదేవిపల్లి, జూలై 21,(విజయక్రాంతి ) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించి, అర్హులందరికీ ఓటు హక్కు అందేలా చూడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో మండల పరిధిలోని లోతువాగు గ్రామంలో మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రజాప్రతినిధులను ఎన్నుకునే శక్తి ఓటుకే ఉందన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత స్థానిక శ్రేణులపై ఉందన్నారు. ముఖ్యంగా పార్టీ తరఫున నియమితులైన బిఎల్‌ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) ఎప్పటికప్పుడు ఓటర్ జాబితాలను పరిశీలించి లోపాలను సవరించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ కె యాకూబ్ పశ, ఈసం రాములు, పట్నం కుటుంబరావు, రజని, రాజు, మహేష్, బోయిన స్వరూప, నబీ, దాసు, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






