26 August, 2026 | 3:43 AM

మొక్కల పరిరక్షణతో పర్యావరణ పరిరక్షణ సాధ్యం

26-08-2026 12:00 AM

మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట రత్నం బాబు

కోదాడ ఆగస్టు 25: మొక్కల పరిరక్షణతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట రత్నం బాబు, కౌన్సిలర్ చీమ నరేష్ పేర్కొన్నారు. మం గళవారం వన మహోత్సవం సందర్భంగా తొమ్మిదవ వార్డులో వారు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాక సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.. వాతావరణ సమతుల్యానికి, సకాలంలో వర్షాలు కురిసేందుకు మొక్కల సంరక్షణ అవసరమన్నారు.. వార్డులో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమాదేవి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి వార్డు కౌన్సిలర్లు గోపి కాటమరాజు స్వప్న బాలేంద్ర నాగేశ్వరరావు రంగమ్మ మెప్మా సభ్యులు ఆర్పీలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.