calender_icon.png 8 August, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10న ఎప్‌సెట్ తుది విడత సీట్లు కేటాయింపు

07-08-2025 12:00:00 AM

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఈనెల 10న టీజీ ఎప్‌సెట్ తుది విడత సీట్లను విద్యార్థులకు కేటాయించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. రేపటి వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.

ఆతర్వాత ఈనెల 10న తుది విడత సీట్లను కేటాయించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎప్‌సెట్ కన్వీనర్ ఏ.శ్రీదేవసేన తెలిపారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈనెల 5వ తేదీ నుంచి షురూ అయిన విషయం తెలిసిందే.