08-08-2025 01:13:47 PM
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): అందరికీ అందుబాటులో ఉంటూ వారికి ఆర్థికపరమైన విశేషమైన సేవలు అందించి అభివృద్ధిలోకి రావాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని హైదరాబాదు రోడ్డులో కొంకా, అసోసియేట్స్ నూతనంగా ఏర్పాటు చేసిన చార్టెర్డ్ అకౌంట్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కనగల్ మాజీ ఎంపీపీ ఎస్ కే కరీం పాషా,మాజీ జెడ్పిటిసి చిట్ల వెంకటేశం , మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, ధోటి శ్రీనివాస్, కనగల్ పార్టీ అధ్యక్షుడు అయితగోని యాదయ్య, బకరం వెంకన్న, కడారి కృష్ణయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, ఎర్ర మాద వెంకటరెడ్డి, మర్రి మల్లేష్, కన్నెబోయిన అంజి బాబు, కన్నెబోయిన సతీష్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.