08-08-2025 01:32:13 PM
భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు
గద్వాల, (విజయక్రాంతి): గద్వాల జిల్లా(Gadwal District) దరూర్ మండలంలో గత రెండు రోజుల(గురువారం, శుక్రవారం) వ్యవధిలో గుర్తు తెలియని జంతువు దాడిలో ఆవు దూడ, కోడెదూడ మృతి చెందడంతో గ్రామస్తులలో ఆందోళన మొదలైంది. మొదట గుర్తు తెలియని జంతువు హైనా అయిండొచ్చని అందరు అనుమానాలు వ్యక్తం చేశారు. శుక్రవారం మరో మారు గుర్తు తెలియని జంతువు దాడి లో కోడె దూడ మృతి చెందడంతో అటవీశాఖ అధికారులు శుక్రవారం కొత్తపాలెంకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కొన్ని చోట్ల జాడలు కనపడటంతో చిరుతవే అని ఫారెస్ట్ అధికారులు, గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.