calender_icon.png 8 August, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజలకు అండగా సీఎం సహాయ నిధి...

08-08-2025 01:11:54 PM

గద్వాల,(విజయక్రాంతి):  అనారోగ్య బారిన పడి మెరుగైన వైద్య సేవలను అందిపుచ్చుకున్న పేద ప్రజలకు సి ఎం సహాయ నిధి(CM Relief Fund ) ఎల్లపుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.  నియోజకవర్గ పరిధిలో ని పలు మండలాల, గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు అయిన సి ఎం సహాయ నిధి చెక్కులను శుక్రవారం జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో అందచేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి,  జి వేణుగోపాల , మాజీ  జెడ్పిటిసి రాజశేఖర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్,  తదితరులు పాల్గొన్నారు.