25 July, 2026 | 11:56 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

అవగాహనతోనే సికిల్ సెల్ నిర్మూలన

20-06-2024 12:22 AM
  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 19 (విజయక్రాంతి): సరైన అవగాహనతోనే సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. ప్రజల్లో సికిల్ సెల్ వ్యాధిపై సరైన అవగాహన లేక వ్యాధి గుర్తించడంలో ఆలస్యమై అనేక మంది వ్యాధిబారిన పడుతున్నారన్నారు. ఈ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించాలని,  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.