calender_icon.png 9 January, 2026 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ల లిస్టులో తప్పుల తడకలు

06-01-2026 12:27:38 AM

కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ నాయకులు

శంకర్ పల్లి, జనవరి 5(విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్  ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీ ల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో  మున్సిపాలిటీలో వివిధ వార్డులకు సంబంధించిన ఓటర్ లిస్ట్ లను ప్రదర్శించినట్లు కమిషనర్ ఆయా పార్టీల నాయకులకు వివరించారు. ఓటర్ జాబితాలో ఏమైనా ఫిర్యాదులుంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు.

సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జనవరి 1-2026 న విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పలు తప్పు ల తడకలు ఉన్నాయని కమిషన్ తీసుకొచ్చారు. పలు వార్డు లో మృతి చెందిన వ్యక్తుల పేర్లు, ఒకే వ్యక్తికి రెండుసార్లు ఓటర్ నమోదు అయిన పేర్లు, మునిసిపాలిటీ లో లేని వారి పేర్లు ఉన్నాయన్నారు.

ఇవి ఎన్నికల న్యాయసమ్మతతపై సందేహాలు కలిగిస్తున్నాయని, వెంటనే తగు చర్యలు తీసుకుని ఓటరు జాబితా సవరించి, పారదర్శకమైన జాబితాను సిద్ధం చేయాలని కోరారు.స్థానికంగా పలుమార్లు తనిఖీ చేసినప్పటికీ ఈ తప్పులు ఇంకా సరిచేయలేదని మృతుల ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, బయటి వారి ఓట్లు దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉండి, నిజమైన ఓటర్ల హక్కులకు నష్టం కలిగింస్తాయని పేర్కొన్నారు.

కేవలం 7 వ వార్డు పరిధిలో నే సుమారు 150 అనధికార ఓట్లు ఉన్నాయని, మొత్తం మున్సిపల్ వార్డుల్లో ఇలాంటి ఓట్లు గణనీయంగా ఉన్నాయని వాటి వల్ల ప్రజాస్వామ్య ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు, తగు చర్యలు తీసుకుని సత్వరమే సమస్య పరిష్కారించకపోతే న్యాయపోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమం బి ఆర్ ఎస్ నాయకులు పిఎసిఎస్ మాజీ చైర్మన్ బద్ధం శశిధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పార్శి బాలక్రిష్ణ, మాజీ సర్పంచ్ శ్రీధర్, అడ్వకేట్ ఉపేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.