calender_icon.png 19 August, 2025 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌకర్యాలులేని ఎర్రుపాలెం రైల్వేస్టేషన్

18-08-2025 12:08:18 AM

  1. ఆదాయ వనరులు పుష్కలం

దూర ప్రయాణాలకు అవస్థలు-సౌకర్యాలు లేమి

ఎర్రుపాలెం, ఆగస్టు 17 ( విజయ క్రాంతి): దక్షిణ మధ్య రైల్వే మండలం లోని ఎర్రుపాలెం రైల్వే  స్టేషన్ ప్రధాన నగరాలైన హైదరాబాద్ చెన్నై మార్గం లో ఉన్నది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఎర్రుపాలెం రైల్వే స్టేష న్ కు ప్రత్యేకమైన స్థానం వుంది.

ఖమ్మం జి ల్లాలో ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దు లో ఈ స్టేషన్ వుంది. ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ కు ఆంధ్ర ప్రాంతం లోని గ్రామాలైన కంచికచర్ల  జుజ్జూరు, అల్లూరు, పెద్దాపురం, మాధవరం, జయంతి, నుంచి ప్రయాణికులు పెద్ద సంఖ్య లో హైదరాబాదుకు మరియు తిరుపతికి ప్ర తినిత్యం ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆంధ్ర ప్రాంతం నుండి ప్రతిరోజు విజయవాడ, ఖమ్మం వెళ్లే ప్రయాణికులతో పాటు రోజువారి కూలి పనులు చేసుకునే వారు సై తం ప్రతినిత్యం వందలాదిమంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణం చేయ వలసి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలోని చిట్టచివరి ఈ స్టేషన్ కు ఎర్రుపాలెం మండలంలోని దాదాపు అన్ని గ్రామాల నుండి ప్ర తిరోజు వివిధ పనుల నిమిత్తం విద్యార్థులు, వ్యాపారస్తులు వివిధ కూలి పనుల కొరకు ఎర్రుపాలెం నుండి మధిర ఖమ్మం వరంగల్ హైదరాబాద్ నగరాలకు ప్రతిరోజు ప్రయాణికులు తమ ప్రయాణాలను సాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ చెన్నై మార్గంలో ఉన్న ఈ స్టేషన్ నుండే ప్రధాన సూపర్ ఫాస్ట్ రైళ్లు నడుస్తుంటాయి.

వీటిలో కొన్ని రైళ్లు మాత్ర మే ఈ స్టేషన్లో ఆగుతున్నాయి. వాటిలో గో ల్కొండ , కృష్ణ , రైళ్లు ,విజయవాడ డోర్నకల్ ,భద్రాచలం రోడ్డు ప్యాసింజర్ రైళ్లు మాత్ర మే ఈ స్టేషన్లో ఆగుతున్నాయి. దూర ప్రాం తాలకు వెళ్లే ప్రయాణికులు తిరుపతి కానీ హైదరాబాద్ కానీ వెళ్లాలంటే అటు విజయవాడ కానీ ఇటు మధిర కానీ వెళ్లి ప్రయాణం చేసి రైలు ఎక్కవలసి ఉంటుంది. దీనితో ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ స్టేషన్ నుంచి రోజు వందలాది ప్రయాణికులు ప్రయాణం చేయడం వలన ఈ స్టేషన్ కు ఆదాయము సమకూరుతుం ది.

హైదరాబాద్ కు నిత్యం ప్రయాణికులు పలు పనులు నిమిత్తం ఈ స్టేషన్ నుండే రాకపోకలు కొనసాగిస్తున్నారు. హైదరాబాదుకు త్వరగా వెళ్ళటానికి శాతవాహన రైలు ఈ స్టేషన్లో ఆగదు. దశాబ్ద కాలం నుండి శాతవాహన రైలును ఈ స్టేషన్ లో ఆపాలని ఎన్నోసార్లు రైల్వే అధికారులకు ఇక్కడ ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు సైతం శాతవాహన రైలు ను ఎర్రుపాలెం స్టేషన్ లో ఆపాలని ప్రయాణికుల అవస్థలను చూసి రైల్వే అధికారుల దృష్టికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది ఎర్రుపాలెం మండలంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం జమలాపురం గ్రామం లో ఉన్నది. ఈ దేవాలయం చిన్న తిరుపతిగా ప్రసిద్ధికెక్కినది.

ఈ దేవాలయానికి ప్రతి నిత్యం ఆంధ్ర ప్రాంతం నుండి ,హైదరాబాద్ నుండి భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. భక్తులు జమలాపురం దేవస్థానానికి చేరుకోవాలంటే ఈ స్టేషన్ నుండే వెళ్లవలసి ఉంటుంది. 

సుదూర ప్రాంతాల నుండి భక్తులు సరియైన రైలు వసతి లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. శాతవాహన వంటి రైళ్లను ఈ స్టేషన్లో ఆపినట్లైతే భక్తులకు, ప్ర యాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ స్టేషన్లో ప్రయాణికులు కూర్చోవడానికి సరియైన రూములు కానీ. మరుగుదొడ్లు కా నీ లేవు.

వర్షాకాలం ,ఎండాకాలం ప్రయాణికులు స్టేషన్ కు వచ్చి ప్రయాణం చేయా లంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు కూర్చోడానికి కుర్చీలను, పైన షెల్టర్లను ఏర్పాటు చేస్తే ప్రయాణికుల అవస్థలు తొలగిపోతాయి. ఈ స్టేషన్లో శాతవాహన రైలును ఆపాలని భక్తులు, ప్రయా ణికులు ,మండల ప్రజలు రైల్వే అధికారులను కోరుతున్నారు.