calender_icon.png 19 August, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా లక్ష్మణ్ వర్సిటీని సందర్శించిన మంత్రి తుమ్మల

19-08-2025 11:48:51 AM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని ములుగు కొండా లక్ష్మణ్ వర్సిటీ(Konda Laxman Horticultural University)ని మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) సందర్శించారు. మంత్రి తుమ్మల వర్సిటీలోని పలు అభివృద్ది కార్యక్రమాలను రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు సునీల్, భవానిరెడ్డితో కలిసి ప్రారంభించారు. సెంట్రలైజ్డ్ డైనింగ్, కిచెన్ హాల్, ఈ-గ్రంథాలయంను మంత్రి ప్రారంభించారు. అలాగే స్మార్ట్ క్లాస్ రూమ్స్ ను పరిశీలించిన తుమ్మల.. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలో ముక్కలు నాటారు.