19-08-2025 11:54:44 AM
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలి..
నిజాంసాగర్ (విజయక్రాంతి): నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar Project) వరద గేట్ల ద్వారా వదులుతున్న నీటి ప్రవాహాన్ని మంగళవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్(Agro Industries Corporation Chairman Kasula Balraj) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు నుండి నిజాంసాగర్ కు వరద ఉధృతి పెరగడంతో గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులు, ప్రజలు చెరువులు, నీటి కుంటల వద్దకు వెళ్లరాదని, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తలు వహించాలన్నారు. రైతులు పంట పొలాల్లో విద్యుత్ తీగలు, బోరు మోటర్ల వద్ద తడిచేతులతో తాకరాదని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్లలో నుండి బయటకు రావద్దని సూచించారు.