18-08-2025 12:06:42 AM
చేర్యాల, ఆగస్టు 17 : బోనాల పండుగను చేర్యాల పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు.శ్రావణ మాసం చివరి ఆదివారం రోజున జరుపుకుంటారు.ఈ పండుగ సందర్భంగా మహిళలు ప్రత్యేక నైవేద్యాన్ని గ్రామదేవతలైన పోచమ్మ మైసమ్మ మంకాలమ్మ లకు బెల్లం తో చేసిన నైవేద్యాన్ని సమర్పించి పాడిపంటలు చల్లగా ఉండాలని అంటువ్యాధులు రాకుండా ఉండాలని గ్రామ దేవతలను కోరుకున్నారు.పోతురాజుల విన్యాసాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛ నియ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తూ నిర్వహించారు.