calender_icon.png 19 August, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి విగ్రహం తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్

19-08-2025 11:52:35 AM

కామారెడ్డి జిల్లాలో ఒకరి మృతి..

మరొకరికి గాయాలు..

కామారెడ్డి (విజయక్రాంతి): గణపతి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ వైర్లు తగిలి షాక్ కు గురయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ(19), సిరిసిల్ల సుభాష్ నగర్ కు చెందిన సాయి(24) గణపతి విగ్రహాన్ని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద కొనుగోలు చేసి వాహనంపై తీసుకువస్తుండగా కామారెడ్డి జిల్లా(Kamareddy District) మాచారెడ్డి మండలం ఆరేపల్లి కస్తూర్బ స్కూల్ వద్ద విద్యుత్ షాక్ కు ఇద్దరు కిందపడిపోయారు. వీరిలో సిరిసిల్ల గోపాల్నగర్ కు చెందిన లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన సాయిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినాయకుని విగ్రహాన్ని తరలిస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆనందంగా వినాయక విగ్రహాన్ని తీసుకోవాల్సిన విద్యుత్ తీగలు తలిగి ఒకరు మృతి చెందడం మరొకరు గాయపడడం గణేష్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మృతుని బంధువులు వస్తే పూర్తి వివరాలు తెలియాల్సిందే.