వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగొద్దు
పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌కు మాల సంఘాల జేఏసీ నేతల విజ్ఞప్తి
ముషీరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మం దాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న), జేఏసీ గౌరవాధ్యక్షులు చెరుకు రామచందర్‌లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమా ర్ గౌడ్‌ను కలిసి మాలలకు జరిగిన అన్యా యం గురించి వివరించి వినతి పత్రం అందజేసినట్లు వారు వెల్లడించారు.
రాష్ట్రంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్‌కు వ్యతిరేకంగా, సరిగా జనాభా లెక్కలు సేకరించకుండా, అశాస్త్రీయంగా జరిగిన ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీల లో 59 కులాలు ఉండగా, ఎస్సీ వర్గీకరణ చట్టం 99 జీవ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలవ వల్ల ఎస్సీలలోని 58 కులాలు పూర్తిగా అన్యాయం కాబడు తున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపా రు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సమస్యను తెలియజేయాలని అన్నారు.
తెలంగాణలోని 40 లక్షల మంది మాలల భవిష్యత్తును నాశనం కాకుం డా చూడాలని కోరినట్లు వారు తెలిపారు. ఎస్సీలలో 58 కులాలకు జరుగుతున్న నష్టాన్ని వివరించిన్నట్లు తెలిపారు. ఇప్పటికే అనేక విద్యాసం స్థల్లో వర్గీకరణ చట్టం 99 వల్ల ఇంజినీరింగ్, లా, ఎంబీబీఎస్, పీహెచ్డీ, బీఎడ్ అడ్మిషన్లలో ఎస్సీలలోని 58 కులాల విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు.
సందర్భంగా సానుకూలంగా స్పందిం చిన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల గ్రూప్- 1, గ్రూప్ -3లో ఉన్న కులాలకు నష్టం జరుగుతున్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎవరికి కూడా అన్యా యం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. మహేష్ కుమార్‌ను కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర మాల విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు మాదాసు రాహు ల్, తెలంగాణ మాల యువజన సంఘాల జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ వీరస్వామి, మాల విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.






