1 April, 2026 | 2:35 AM

ఉద్యాన వర్సిటీలో హార్టీ ఇన్నోవేషన్ హబ్ స్థాపన

01-04-2026 12:00 AM

వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండా రాజిరెడ్డి వెల్లడి

గజ్వేల్, మార్చి 31: శ్రీ కొండా లక్ష్మణ్ తె లంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKL TGHU) లో హార్టీ ఇన్నోవేషన్ హబ్ స్థాపనకు చర్యలు చేపట్టినట్లు వర్సిటీ వైస్ ఛా న్సలర్ డాక్టర్ దండా రాజి రెడ్డి తెలిపారు. ఉ ద్యాన రంగంలో ఆధునిక సాంకేతికతలను ప్రవేశపెట్టి పరిశోధనలను మరింత అభివృ ద్ధి చేయడం ఈ హబ్ ప్రధాన లక్ష్యమన్నారు. ములుగులోని వర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని ఏఎన్జీఆర్‌ఏయూ మాజీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ సురవరం సుధాకర్ రెడ్డి, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా నాచురల్ రిసోర్సెస్ డైరెక్టర్ కె. రమేష్ రెడ్డి మంగళవారం సందర్శించారు.

ఈ సందర్శనలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో ఫ్యా కల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లు, సంయుక్త పరిశోధన ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛా న్స్లర్ డాక్టర్ దండా రాజి రెడ్డి మాట్లాడుతూ హార్టీ ఇన్నోవేషన్ హబ్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశోధన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, విద్యార్థులు, అధ్యాపకులకు ప్రపంచ స్థాయి పరిజ్ఞానం లభిస్తుందన్నారు. ఈ హబ్ ద్వారా ఉద్యాన రంగంలో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. హబ్లో భాగం గా రిమోట్ సెన్సింగ్ & జిఐఎస్, పోస్ట్ హార్వె స్ట్ టెక్నాలజీ, వెబ్ స్టూడియో, ఉద్యాన రంగానికి ఇన్క్యూబేషన్ సెంటర్ వంటి విభాగా లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ విభాగాల ద్వారా పరిశోధన, శిక్షణ, సాంకేతిక సేవలు సమగ్రంగా అందించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు, విద్యార్థులు, శాస్త్రవే త్తలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరువ కావడంతో పాటు, అంతర్జాతీయ సహకారంతో ఉద్యాన రంగ అభివృద్ధికి కొత్త మా ర్గాలు సుగమం అవుతాయని విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్ర మంలో రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డా. చీనా నాయక్, యూనివర్సిటీ కన్సల్టెంట్ డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ సునందిని, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ సురేష్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్ట ర్ శ్రీనివాసన్, టెక్నికల్ సెక్రటరీ డాక్టర్ పిడిగం సైదయ్య, ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ సుచిత్రతో పాటు బోధన సిబ్బంది పాల్గొన్నారు.