25-10-2025 08:37:37 AM
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): కేటీపీఎస్ మాల ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో “మాల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ (MEWS)” అనే కొత్త సంస్థను అధికారికంగా స్థాపించారు. ఈ సొసైటీ ప్రధాన లక్ష్యం — మాల సమాజం యొక్క సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, సంక్షేమాన్ని పెంపొందించడం. సమాజంలో ప్రతిభావంతులైన వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేయడం, విద్య , ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. సమావేశంలో జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు బూర్గుల విజయభాస్కర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్లబల్లి రాంబాబు, నాయకులు వేమూరి సంపత్, శెట్టిరామచంద్ర, భూపతి సునీల్ తదితరులు పాల్గొన్నారు.వీరు మాట్లాడుతూ, ఈనెల 26న నిర్వహించే సమావేశంలో ఈ సొసైటీ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నామన్నారు. ఈ కార్యక్రమం ఎస్.వి. రెడ్డి గార్డెన్స్, మూచింతల్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కార్మిక, ఉపాధి, శిక్షణ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, అద్దంకి దయాకర్ (MP), ఎంఎల్‌సీ గోరంటి వెంకన్న, ఎంఎల్‌సీ భక్తి వెంకటయ్య తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. సంఘం తరఫున అన్ని మాల సహోదరులు, సోదరీమణులు ఈ సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తమ విలువైన సూచనలు అందించాలని నాయకులు కోరారు.