25-10-2025 09:52:49 AM
మూసాపేట పరిధి గూడ్స్ షెడ్ రోడ్డులో అగ్నిప్రమాదం
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా(Medchal Malkajgiri District) మూసాపేట పరిధి గూడ్స్ షెడ్ రోడ్డులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో(Indian Container Corporation Depot) అగ్నిప్రమాదం జరిగింది. గోదాములో నిల్వ ఉంచిన రసాయన విభాగంలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను గమనించిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.