25-10-2025 08:35:29 AM
సిద్ధిపేటలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో వర్క్‌షాప్
సిద్ధిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళ డిగ్రీ కళాశాలలో(Telangana Social Welfare Residential Degree College) ఇంగ్లీష్ విభాగం అధిపతి డాక్టర్ కొరివి వినాయకళ ఆధ్వర్యంలో గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐస్ ఫోరం సహకారంతో “ది పవర్ ఆఫ్ వర్డ్స్ హౌస్ , ఇంగ్లీష్ వోకాబ్యులరీ షేప్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏట్ వర్క్” అనే అంశంపై ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. యుఎస్‌ఏ లో సర్వీస్ నౌ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా 15 సంవత్సరాలకుపైగా అనుభవం ఉండి, ఉన్నత విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి వంటి సామాజిక రంగాల్లో సక్రియంగా సేవలందిస్తున్నా రాజశేఖర్ కడారి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ రంగంలో భావోద్వేగ మేధస్సును పెంపొందించడంలో ఇంగ్లీష్ పదసంపద యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, “స్పష్టమైన సహానుభూతి గల సంభాషణ” ఎలా బహుళ సాంస్కృతిక వాతావరణంలో సఖ్యతను, సామూహిక ఫలితాలను పెంచుతుందో వివరించారు.
వర్క్‌షాప్‌లో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ, “ఇంగ్లీష్ భాష కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదనీ, అది భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తపరచడానికి, టీమ్ వర్క్‌లో సమన్వయాన్ని పెంపొందించడానికి కూడా దోహదపడుతుందని తెలుసుకున్నామన్నారు. ఇలాంటి వర్క్‌షాప్‌లు విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధికి మార్గం చూపుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కోరవి వినయకళ, ఇంగ్లీష్ విభాగాధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కన్వీనర్‌గా సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత, అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ విభాగాల సిబ్బంది హాజరయ్యారు.