calender_icon.png 25 October, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో రవాణా శాఖ అప్రమత్తం

25-10-2025 09:20:16 AM

హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద(Kurnool bus accident) ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తం అయింది. శనివారం నాడు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై ఆర్టీఏ బృందాలు(RTA teams) విస్తృత తనిఖీలు చేస్తున్నాయి. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. 

బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను ఆర్టీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించని 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు(Cases against Travels buses) నమోదు చేసి, ఒక బస్సును సీజ్ చేశారు. ఎల్బీనగర్ లోని చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో నాలుగు బస్సులపై కేసు నమోదు చేశారు. బీమా, లైసెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికేట్ లు లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ అధికారులు(Transport Department officials) హెచ్చరిస్తున్నారు.