calender_icon.png 25 October, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోర్డాన్ కార్మికులకు బాసటగా నిలిచిన హరీష్ రావు

25-10-2025 11:35:29 AM

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ మంత్రి టి. హరీష్ రావు(Harish Rao) జోర్డాన్ కార్మికులకు బాసటగా నిలిచారు. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు మాజీ మంత్రి హరీష్ రావు కృషితో సొంతూళ్లకు చేరుకున్నారు. శనివారం తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్న వలస కార్మికులు మాజీ మంత్రి హరీశ్ రావుని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. జోర్డాన్ లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసారని బీఆర్ఎస్ పార్టీకి, హరీశ్ రావుకి ధన్యవాదాలు తెలిపారు.