25-10-2025 10:48:57 AM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్(MPDO Praveen Kumar), ఏపీవో రాజన్న మానవత్వం చాటారు. మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య అతని భార్య మోసం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంతో వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి కింద పడిపోయి గాయపడ్డారు. అటువైపు వెళుతున్న వారు ఇట్టి విషయం గమనించిన ఎంపీడీవో,ఏపీవో కార్యాలయ సిబ్బందితో కలిసి వారి వాహనంలో గాయపడ్డ సత్తయ్య భార్యను వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వారు చేసిన మంచి పనికి ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.