మతం మారినా మూలాలు మారవు
భారత సామాజిక వ్యవస్థలో కుల వివక్ష, అంటరానితనం అనేవి మతపరమైన అంశాలు మాత్రమే కావు, శతాబ్దాలుగా ఒక సమూహాన్ని అణచివేసిన సామాజిక ఆధిపత్యం. ఈ బాని సత్వం నుంచి బయటపడటానికి దళితు లు,ఆదివాసీలు, కొన్ని బహుజన కులాలు చరిత్ర పొడవునా నిరంతరం ప్రత్యామ్నా య మార్గాల కోసం అన్వేషిస్తూనే ఉన్నా యి. ప్రాచీన కాలంలో వైదిక మతంలోని అసమానతలను సవాలు చేస్తూ ఉద్భవించిన బౌద్ధం, జైనం వంటి శ్రామిక సంప్ర దాయాలు ఆ కాలంలో విముక్తి మార్గాలుగా నిలిచాయి.
ముఖ్యంగా బుద్ధుడు ప్రబోధించిన సమానత్వం, అహింస, స్వేచ్ఛా పూరితమైన ధర్మం దళిత, ఆదివాసీ, బహుజన వర్గాలకు ఒక గొప్ప ఆశ గా కనిపించాయి. కాలక్రమేణా భారత్‌లో బౌద్ధం తన ప్రభావాన్ని కోల్పోయింది. 18, 19వ శతాబ్దాల నాటికి దళిత సమా జం తన ఆత్మగౌరవ పోరాటంలో ఒక శూన్యతను ఎదుర్కొంది. సరిగ్గా అదే సమయంలో పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన క్రైస్తవ మిషనరీల రూపంలో వారికి ఒక కొత్త ఆశాకిరణం కనిపించింది. ఆధునిక కాలంలో దళితులు, ఆదివాసీలు అత్యధికంగా క్రైస్తవ మతం వైపు మొగ్గుచూప డానికి కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాకుం డా, బలమైన సాంఘిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయని మనం గుర్తించాలి.
ఆదివాసీలు క్రైస్తవం వైపు వెళ్లడానికి ప్రధాన కారణం ఆ మతం అందించిన ఆర్థిక, హార్దిక తోడ్పాటు.- బౌద్దం లేదా జైనం అప్పట్లో తాత్విక చర్చలకే పరిమితమై ఉన్నాయి. కానీ, క్రైస్తవ మిషనరీలు ఏజెన్సీలకు సామాజిక సేవను ఒక ఉద్యమంలా చేపట్టాయి. అగ్రవర్ణాలకు మాత్ర మే పరిమితమైన విద్యను వెలి వాడల్లోని పిల్లలకు, అడవిలో ఆదివాసీలకు అందుబాటులోకి తెచ్చాయి. అక్షరం ముక్కరాని దళిత, ఆదివాసీ బిడ్డలకు పాఠశాలల తలుపులు తీసి వారిలో జ్ఞానాన్ని నింపడం ద్వారా ఒక కొత్త తరపు సామాజిక మేధావులను తయారు చేశాయి.
విద్యతో పాటు వైద్యం విషయంలో కూడా మిషనరీలు విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. అంటరానితనం కారణంగా కనీ స వైద్యానికి నోచుకోని దళితులకు, ఆదివాసీలకు తమ ఆసుపత్రుల్లో చికిత్స అంది స్తూ సమానత్వం విలువలను చాటిచెప్పాయి. ఈ సేవా మార్గం అట్టడుగు వర్గా లకు, ఆదివాసీలకు ఒక భరోసాను ఇచ్చిం ది. ఒకవైపు అమానుషమైన అంటరానిత నం, మరోవైపు ఆదరించే అక్కున చేర్చుకునే మిషనరీల ప్రేమ ఉంది. ఈ రెండింటి మధ్య ఆదివాసీ సమాజం సహజంగానే క్రైస్తవం వైపు అడుగులు వేసింది.
ఆత్మగౌరవం అనేది మనిషికి ప్రాణవాయువు వంటిది. హిందూ సమాజంలో అస్పృశ్యులుగా ముద్ర వేయించుకుని సమాజానికి దూరంగా ఉన్న వారికి క్రైస్త వం దేవుని స్వరూపంలో పుట్టిన బిడ్డలు అనే గొప్ప గుర్తింపును ఇచ్చింది. చర్చికి వెళ్లడం వల్ల వారికి లభించిన సామాజిక సమాన హోదా సామాన్యమైనది కాదు. ఆదివారం అందరితో సమానంగా దేవుడిని ప్రార్థించడం వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది మత మార్పిడి మాత్రమే కాదు, సామాజిక విముక్తి ప్రయాణం. పాశ్చాత్య వేషధారణ, ఇంగ్లీష్ చదువులు, మిషనరీల అండతో వారు తమ పాత కుల గుర్తింపు నుంచి క్రమంగా బయటపడగలిగారు.
రాజకీయ, రక్షణపరమైన అంశాలు కూడా ఈ పరిణామంలో కీలకపాత్ర పోషించాయి. బ్రిటిష్ పాలనా కాలంలో క్రైస్తవం స్వీకరించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో, మిలిటరీలో, ఇతర పరిపాలనా విభాగాల్లో ప్రాధాన్యత ఉండేది. అగ్రవర్ణ భూస్వాముల దౌర్జన్యాల నుంచి రక్షణ పొందడానికి అధికారంలో ఉన్నవారి మతాన్ని స్వీకరించడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా కూడా మారింది. ఆదివాసీలు, దళితుల తరపున మిషనరీలు కోర్టుల్లో పోరాడటం, అధికారుల దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లడం ద్వారా వారికి ఒక రకమైన సామాజిక భద్రత దొరికింది. క్రైస్తవం అనేది ఆధ్యాత్మిక శాంతి కోసం మాత్రమే కాకుండా, ఈ లోకంలో గౌరవంగా బతకడానికి ఒక మార్గంగా దళితు లు, ఆదివాసీలు ఎంచుకున్నారు. జైనం లేదా బౌద్ధం అప్పట్లో ఇటువంటి రాజకీయ లేదా సామాజిక రక్షణను అందించే స్థితిలో లేవు. అందుకే ఆదివాసీ సమాజం సిద్ధాంతాల కంటే కూడా ఆచరణాత్మకమై న సామాజిక భద్రత వైపు మొగ్గుచూపింది.
మిషనరీలు అనుసరించిన సాంస్కృతి క, సమ్మిళిత విధానం కూడా ఆదివాసీల నూ ఆకట్టుకుంది. వారు బైబిల్‌ను స్థానిక భాషల్లోకి అనువదించడమే కాకుండా ఆదివాసీలు పాడుకునే జానపద బాణీల్లోనే క్రైస్తవ కీర్తనలు రూపొందించారు. దీనివల్ల మతం మారినప్పటికీ తమ సొంత మూలాలకు భంగం కలగలేదని వారు భావించారు. చర్చి ఒక ప్రార్థనా స్థలంగా కాకుండా అదొక సామాజిక సమానత్వపు సంస్కృతికి వేదికగా మారింది. ఆదివారం నాడు అందరూ కష్టసుఖాలు పంచుకోవ డం, పిల్లల చదువులు, భవిష్యత్, ఆత్మగౌరవం గురించి చర్చించుకోవడం వారిలో ఒక కమ్యూనిటీ భావనను పెంచింది. ఆదివాసీలు బౌద్ధ, జైన, హిందూత్వం కాదని క్రైస్తవాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కార ణం ఆ మతం చూపిన ఆచరణాత్మక విముక్తి మార్గమే. విద్య, వైద్యం, ఆత్మగౌర వం అనే మూడు స్తంభాలపై క్రైస్తవ మిషనరీలు ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నింపాయి.
ప్రాచీన బౌద్ధ, జైన సంప్రదాయాలు అణచివేతకు వ్యతిరేకంగా తాత్విక పునాదులు వేసినప్పటికీ ఆధునిక కాలం లో ఆదివాసీ సమాజం ఎదుర్కొన్న తక్షణ అవసరాలకు క్రైస్తవం ఒక పరిష్కారంగా నిలిచింది. నేడు రాజ్యాంగం కల్పించిన హక్కులు, అంబేద్కరిజం పట్ల పెరుగుతు న్న అవగాహన వల్ల మళ్లీ బౌద్ధం వైపు ఆస క్తి పెరుగుతున్నప్పటికీ, ఆదివాసీ సామాజిక చరిత్రలో క్రైస్తనం పోషించిన పాత్రను విస్మరించలేం. అది ఒక మత మార్పు కాదు, కొన్ని కోట్ల మంది అస్పృశ్యుల ఆత్మగౌరవ ప్రకటన. కుల రహిత సమా జం కోసం సాగుతున్న ఈ సుదీర్ఘ ప్రయాణంలో క్రైస్తవం ఒక అతి ముఖ్యమైన సామాజిక మజిలీగా నిలిచింది.
ఆదివాసీలు దళితులు ఆత్మగౌరవం కోసమో, సామాజిక వెసులుబాటు కోస మో క్రైస్తవం స్వీకరించినప్పటికీ దళితులు, ఆదివాసీల వెంట నీడగా నడిచొచ్చింది మాత్రం కులమే. మొదట క్రైస్తవంలోకి వెళ్లినా దళితులకు సామాజికంగా కొంత గౌరవం దక్కినప్పటికీ కాలక్రమేణా అవమానం తప్ప ఏమి లేకుండాపోయింది. తిరుగుబాటు తత్వం ఉందని నమ్ముతున్న జెన్ జీ తరం దళిత క్రైస్తవులను ఇంకా హేళన చేస్తున్నారు. ఇటీవల దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు రాదన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా దళిత క్రైస్తవులను అవమానించినట్టుగానే ఉంది. కొంతమంది రాజ్యాంగబద్ధమైనది కాబట్టి రాజ్యంగా సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మాట్లాడుతున్నారు. కానీ, అది ఈ పాలనలో జరగదనేది వాస్తవం. మొత్తంగా దళితులు, ఆదివాసీ లు ఏ మతంలో ఉన్నా వారి సాంస్కృతిక నేపథ్య మూలాలు అంత తేలిగ్గా పోవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
వ్యాసకర్త సెల్: 9866073866






