‘బొమ్మలపల్లకి’లో తెలంగాణ చరిత్ర
తెలంగాణ అపురూప చరిత్రను, సంస్కృతిని, ప్రకృతి వైభవాన్ని నేటి తరానికి దృశ్య-శ్రవణ మాధ్యమాల ద్వారా చేరువ చేసేందుకు ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ (రిజి. నెం. 144/2026) ప్రతిష్టాత్మకమైన ‘బొమ్మలపల్లకి’ వీడియో పోటీని నిర్వహిస్తోంది. ‘కోటి కనులు వీక్షించనీ.. మన తెలంగాణ దృశ్య వైభవం!’ అనే నినాదంతో సాగుతున్న ఈ పోటీ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో చరిత్ర నమోదును ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశం.
పోటీ ప్రధానాంశాలు:
అంశం: తెలంగాణ చరిత్ర, సంస్కృతి లేదా ప్రకృతిని ప్రతిబింబించే వీడియోలు తీసి పంపించాలి (తెలుగు భాషలో).
నిడివి: గరిష్టంగా 10 నిమిషాలు (16:9 లాండ్‌స్కేప్ నిష్పత్తి).
ఉప అంశాలు: స్థానిక చరిత్ర (వ్లాగింగ్), అజ్ఞాత చరిత్ర, ఏఐ ద్వారా సృష్టించిన చారిత్రక దృశ్యాలు, ఆహార సంస్కృతి, అంతరించిన వస్తువులు, అరుదైన చిత్రాల వివరణ, ప్రకృతి వనరులు, సాంస్కృతిక ఉత్సవాలు.
నిబంధనలు, నాణ్యత: వీడియోలు స్వంతం గా రూపొందించినవై ఉండాలి. అవాస్తవాలకు తావుండకూడదు. కనీసం 720పీ (ఫుల్ హెచ్‌డీ 1080పీ ఉత్తమం) రిజల్యూషన్ కలిగి ఉండాలి. ప్రాచీన పదాలు లేదా మాండలికాలు వాడితే తెలుగు/ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ జత చేయడం అదనపు అర్హత. ఈ వీడియోలలో కాపీరైట్ లేని సంగీతాన్ని వాడాలి. పరిశోధనా పత్రాల తరహాలోనే వీడియోలోని అంశాలకు తగిన ఆధారా లు పేర్కొనాలి. ఎంపిక విధానం: విజేతలను నిపుణుల బృందం (కంటెంట్, క్వాలిటీ, క్రియేటివిటీ ఆధారంగా), ప్రజాదరణ (యూట్యూబ్‌లో వచ్చే వ్యూస్, లైక్స్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
వీడియో సమర్పణకు చివరి తేదీ: 29-05--2026.
అధికారిక ప్రదర్శన: 02-06-2026 (తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా).
బహుమతుల ప్రదానం: 2026 ఆగస్టు నెలలో.
పంపాల్సిన విధానం:ఆసక్తి గలవారు తమ వీడియోలను 9704123969 నంబర్‌కు వాట్సాప్ డాక్యుమెంట్ లేదా గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా kothatelanganacheritra@gmail.comకు పంపవచ్చు. వీడియోతో పాటు వ్యక్తిగత వివరాలు (బయోడేటా) కూడా జతపరచాలి.
రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/q95XU1Wp49xH1yKg8
తెలంగాణ అస్తిత్వాన్ని, చారిత్రక వారసత్వాన్ని దృశ్య రూపంలో భద్రపరిచే ఈ మహత్కార్యంలో చరిత్ర ప్రేమికులు, యువత, పరిశోధకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ ప్రతినిధులు కోరుతున్నారు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
కొత్త తెలంగాణ చరిత్ర బృందం, 9949498698






