calender_icon.png 9 July, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నేతలకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదు

09-07-2025 12:16:01 AM

కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ఇందిరా శోభన్

హైదరాబాద్ సిటీ బ్యూరో జులై 8 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ నేతలకు నేతలకు అధికారం కోల్పోయిన,అహంకారం పోలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రామరావు అని వంద శాతం ఇవ్వాళ నిరూపించుకున్నాడిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకురా లు ఇందిరా శోభన్ మండిపడ్డారు. మంగళవారం ఇందిరా శోభన్ మాట్లాడుతూ రాష్టంలో ఎక్కడ సమస్య వచ్చిన.. ముందు గా స్పందించేది మంత్రి సీతక్కనే అని ఆమె గుర్తు చేశారు.

ఆడబిడ్డకు అపద వస్తె ముందునేడేది సీతక్క అని ఆమె గుర్తు చేశారు. నిరంతరం ప్రజాసేవే పరమావధిగా భావించే ఇలాంటి వారిని రాజకీయాల్లో ఉండ నివ్వరా.?అని ఆమె ప్రశ్నించారు. దోచుకొని దాచుకొనే వారే రాజకీయాల్లో ఉండాలా..అని ఆమె నిలదీశారు. రాజకీయాలలో నిజాయితీగా ఉండే ఒక ఆదివాసీ బిడ్డ రాజకీయాల్లో ఉండకుండదా అన్నారు.

రాష్ట్రంలో కొందరు ప్రతిపక్ష నేతలు ప్రతి అంశాన్ని సీతక్క కు అంట గట్టే ప్రయత్నం చేస్తు ఆమెపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అడబడ్డలు.. శిఖండిగా వ్యవహరిస్తున్నారు.మాజీ ఎంపీ మాలోతు కవితకు  మంత్రి సీతక్కను అనే అర్హత ఉందా..? అన్నారు. మహబూబాబాద్ ఎంపీగా మాలోతు కవిత వెలగ బెట్టింది ఏంటి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.గిరిజన జాతి బిడ్డల గురించి ఎప్పుడైనా కవిత ఆలోచించిందా  అని... 

గత ప్రభుత్వంలో పోడు రైతుల బట్టలు లేకుండా చెట్టుకు కట్టివేస్తే.. రైతులకు బేడీలు వేసిన.. ఫుడ్ పాయిజన్ జరిగిన సమయంలో ఎక్కడ ఉన్నావు అని చురకలాంటించారు. నేరేళ్ల ఘటనలో ఎందుకు మాట్లాడలేదు... టిఆర్‌ఎస్  హయంలో అరాచకాల  గురించి ఎప్పుడు ఎందుకు నోరు ఇవ్వలేదని అన్నారు. మాలోతు కవిత కేవలం  తమ అధినాయకుడు కేటీఆర్ మెప్పుకోసం మాట్లాడుతుం దన్నారు.

ప్రజా పాలనలో మంత్రికి సీతక్కకు వస్తున్న ప్రజాదారణ ఓర్వలేక ఆమె పై ఆరోపణలు చేస్తూ.. బట్టకాల్చి మీద వేస్తున్నారని చెప్పారు.సీతక్క చేసిన తప్పు ఏంటి అని...ఆదివాసీల హక్కుల కోసం పోరాడింది సీతక్క అని గుర్తు చేశారు. తుల ఉమక్క సామాజిక స్పృహ ఉన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.దోచుకోవడం.. దాచుకోవడం బి ఆర్ ఎస్ కు  కేరాఫ్ అడ్రస్ అన్నారు. సీతక్క పై రాజకీయ ఆరోపణలు చేస్తే.. సహించేది లేదు అని..రాజకీయాల్లో సద్విమర్శలు ఉండాలన్నారు. టిఆర్‌ఎస్ అంటేనే చిల్లర రాజకీయాలు అని ప్రజలకు అర్థం అయ్యిందన్నారు.