14 August, 2026 | 2:58 AM

ప్రతి కార్యకర్త కంకణబద్ధుడు కావాలి

14-08-2026 12:11 AM

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్

ఘట్ కేసర్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కంకణ బద్ధుడు కావాల్సిన అవసరం ఉన్నదని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ఘట్కేసర్ శివారెడ్డిగూడ లోని బంధన్ ఫంక్షన్ హా ల్లో  గురువారం ఘట్కేసర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన  కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఘట్కేసర్ డివిజన్ కాంగ్రెస్, అను బంధ నూతన కమిటీ ఏర్పాటుకై పేర్ల సేకరణ  అలాగే సర్ ప్రక్రియను విజయవంతం చేసిన బిఎల్‌ఏ లకు ఆత్మీయ సన్మానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తో టకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మ లిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉ పాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేస ర్ మున్సిపల్ మాజీ చైర్మన్  పావని యాదవ్, కొంతం బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.