22 August, 2026 | 2:00 AM

ప్రతి బూత్‌ను బలోపేతం చేయాలి

22-08-2026 12:59 AM

బీజేపీ జిల్లా కార్యదర్శి, మండల ప్రభారీ శివనాత్రి వేణు

గణపురం ఆగస్టు 21 (విజయ క్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రెండో దశలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కార్యదర్శి, మండల ప్రభారీ శివనాత్రి వేణు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుప్పటి భద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, తప్పుల్లేని ఓటరు జాబితా రూపకల్పనకు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు.

ఓటరు నమోదు పత్రాలను సక్రమంగా పూర్తి చేయించి సమర్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో బూత్ స్థాయి ఏజెంట్లు, బూత్ అధ్యక్షులదే కీలక పాత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు మంద మహేష్, బీజేపీ సీనియర్ నాయకులు గొర్రె రవి యాదవ్, సోమ దామోదర్, మామిడి శెట్టి సాంబశివుడు, బొద్దుల మొగిలి, బుర్రి సురేష్, ఎన్నిండ్ల సమ్మయ్య, దూడపక సతీష్, జన్ను ప్రశాంత్, గౌరీశెట్టి సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.