22 August, 2026 | 2:01 AM

మహిళల ఆర్థిక సాధికారితకే మహిళా సంఘం భవనాలు

22-08-2026 12:59 AM

సర్పంచ్ కర్నాటి వెంకన్న

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు21: మహిళల ఆర్థిక సాధికారిక కోసమే మహిళా సంఘాల భవనాల నిర్మాణమని సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో వీబీజీరాంజీ పథకం నిధులు రూ.10 లక్షలతో నిర్మించ తలపెట్టిన మహిళా సమాఖ్య భవనం(సంఘబంధం)నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సమావేశాలు,శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సొంతభవనాలు అవసరమని అన్నారు.

అనంతరం భవన నిర్మాణానికి తన సొంత స్థలాన్ని విరాళంగా అందజేసిన గ్రామానికి చెందిన అనిరెడ్డి లక్ష్మీకాంతరెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పీఆర్ ఏఈ కుమారస్వామి,పంచాయతీ కార్యదర్శి సుధాకర్,ఉపసర్పంచ్ లింగంపల్లి రవీందర్,సంఘబంధం అధ్యక్షురాలు రాణి,నాయకులు రేఖల సైదులు,ఎండీ హమీద్,పొట్టిపాక సైదులు,కర్నాటి మురళి,శేఖర్,నాగరాజు,రామకృష్ణ,నరేష్, నవీన్,వార్డు సభ్యులు,మహిళలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.