11 May, 2026 | 9:09 PM

Breaking News

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •   శివంపేట మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ!   •   పాలిసెట్–2026 పరీక్షా ఏర్పాట్లు పూర్తి   •   ప్రధాని మనసు గెలిచిన గరిడేపల్లి 'డప్పు దరువు'   •   జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ అక్షరా శ్రీనివాస్   •   మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం   •   ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   క్షతగాత్రురాలుకి అండగా చేయూత ట్రస్ట్   •   సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •  

ప్రతి బిడ్డకు పోషణతోపాటు విద్య అవసరం

17-09-2025 01:50 AM

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): పుట్టిన ప్రతి బిడ్డను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇచ్చేందుకు పోషణతో పాటు వారికి విద్య కూడా చాలా అవసరమని నల్గొండ సిడిపిఓ తూముల నిర్మల అన్నారు. నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషన్ బీ - పడాయి బీ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు మంగళవారం టీఎన్జీఎస్ భవన్లో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య దశలోనే బిడ్డకు సరైన ఆహారం, విద్య, అభివృద్ధి అవకాశాలు కల్పించేంపదకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకవస్తుందన్నారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ మంచి పౌష్టికాహారం అందించడంతోపాటు చదువుపై కూడా ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. చిన్నారులకు శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి ప్రీస్కూల్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తు వెనకబడిన పిల్లలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలన్నారు. ప్రతి బిడ్డ సమగ్రంగా ఎదగాలంటే టీచర్లుగా మీవంతు కృషి అవసరమని వివరించారు.

0-6 సంవత్స రాలలోపు పిల్లల్లో జరిగే అభివృద్ధి క్షేత్రాల గురించి ప్రేరణ. ఈసీసీఈ, పోషణ, వయసుకు తగ్గిన బరువు, ఎత్తులపై అవగాహన కల్పించారు. నాణ్యమైన బాల్య అభివృద్ధి సంరక్షణ, విద్య, మెదడు పెరుగుదల వంటి ముఖ్యమైన అంశాలపై ప్రొజెక్టర్ సహాయంతో పిపిటి వీడియోలు ప్రజెంటేషన్ ద్వార సులభంగా అర్థమయ్యేలా, ప్రాక్టికల్ ఆక్టివిటీలతో పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సతీష్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పార్వతి, జయమ్మ, మల్లేశ్వరి, లక్ష్మమ్మ, మంజుల, శ్రీలత, పద్మ, సరస్వతి, ప్రణీత, వినోదకుమారి, స్వరూప అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.