calender_icon.png 17 September, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిస్టులు బలోపేతం కావాలి

17-09-2025 01:49:22 AM

అప్పుడే సమాజ అభివృద్ధి 

కమ్యూనిజానికి నేను అభిమానిని

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ, సెప్టెంబర్ 16: నిత్యం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చట్టసభల వెలుపల ఉద్యమాలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టులు బలోపేతం అయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భారీ నీటిపారుదల, పౌరసర ఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడలోని  మేళ్లచెరువు లో నిర్వహించిన సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంతాప సభలో ఆయన మాట్లాడారు.

కష్టాలకు ఓ ర్చి, ఎన్ని అడ్డంకులు వచ్చినా పేద ప్రజల ప  క్షాన నిలబడేది ఎర్రజెండా వారసులేనని పేర్కొన్నారు. కమ్యూనిజానికి తాను వ్యక్తిగత అభిమానినని, వామపక్ష పార్టీలతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉన్నదని, వారితో కలిసి పని చేస్తున్నానని చెప్పారు. కో దాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి వారి సూచనలు, సలహాలు తీసుకుం టున్నామని పేర్కొన్నారు.

విద్యార్థి దశ నుం చి అంచెలంచలుగా భారత కమ్యూనిస్టు పా ర్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన ఆదర్శప్రాయుడు సురవరం సుధాక ర్‌రెడ్డి అని కొనియాడారు. ఆయనతో తనకు వ్యక్తిగత అనుబంధం కూడా ఉన్నదని, నల్లగొండ జిల్లా సమస్యలతో పాటు దేశ సమ స్యలను పార్లమెంటు సమావేశాల్లో వాడీవేడిగా వినిపించిన చరిత్ర సురవరంకు ఉన్న దని గుర్తు చేశారు. తన జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరించిన నిఖార్సయిన నేత అన్నారు.

విద్యార్థి నాయకుడి నుంచి ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం తెలుగు వారికి గర్వకా రణం అని కొనియాడారు. కాగా సురవరం కలలుగన్న డిండి ఎత్తిపోతల పథకాన్ని రూ.1800 కోట్లతో పూర్తి చేస్తానని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో లిఫ్టుల కింద ఉన్న ఆరు లక్షల ఎకరాల ఆయకట్టును పూర్తిస్థాయిలో పారించేందుకుగాను అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను ఏర్పాటు చేశామన్నారు.

కోదాడ, హుజూర్‌నగర్ నియోజ కవర్గాల అభివృద్ధికి తాను, తన సతీమణి పద్మావతి కృషి చేస్తున్నామని, ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దర ఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేస్తామని, సన్న బియ్యం పథకం దేశంలోనే ఎక్కడా అమలు చేయడం లేదని ఈ పథకం చారిత్రాత్మకమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

సీపీఐ జాతీయ సమితి సభ్యు డు పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వామపక్ష అఖిల భారత విద్యార్థి సంఘం నాయ కుడిగా, యువజన నాయకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, అనుబంధ సంఘాల బాధ్యుడిగా తన నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన  సురవరం సుధాకర్‌రెడ్డి వామపక్ష ఉద్యమాలకు దిక్సూచి అన్నారు.

ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లి కంటి సత్యం, శంకర్‌నాయక్, సిపిఐ నాయకులు గన్న చంద్రశేఖర్, బొమ్మగాని ప్రభా కర్, మేకల శ్రీనివాస రావు, బద్దం కృష్ణారెడ్డి, హనుమంతరావు, ఉస్తేల సృజన, మండలం వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.