08-09-2025 12:52:41 AM
సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 7: జిల్లాలో ఈ నెల 9న మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఒక్కో ఉద్యోగి ఒక్కో మొక్క నాటే కార్యక్రమం జరగనుందని కలెక్టర్ కె.హైమావతి తెలిపారు.ఏక్ పెడ్ మా కె నామ్ స్పూర్తి తో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పా రు.
జిల్లాలో 13,900 మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొననున్నారు. మొక్కలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా అం దుబాటులో ఉంటాయని, ముందుగా గుం తలు తవ్వి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చదనం అం దించేందుకు ప్రతి ఉద్యోగి తల్లి పేరుతో మొ క్క నాటి దాన్ని సంరక్షించాలని కలెక్టర్ సూచించారు.