08-09-2025 12:54:01 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట/మెదక్, సెప్టెంబర్ 7(విజయక్రాంతి):ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం జిల్లాలోని పాపన్నపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.
ఆసుపత్రిలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలి..
మెదక్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం పూర్తయేలా పనులలో వేగం పెంచాలని కలెక్టర్ పంచాయతీరాజ్ ఇంజనీర్ ను ఆదేశించారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.5 కోట్ల వ్యయంతో ఇందిర మహిళా శక్తి భవనాన్ని నిర్మించుకుంటున్నామని, పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళ శక్తి భవన నిర్మాణం పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువు తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.