17 August, 2026 | 1:07 AM

రెండు బైక్‌లు ఢీకొని యువకుడి మృతి

17-08-2026 12:00 AM

మల్దకల్, ఆగస్టు 16: మండల పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో పెద్దొడ్డి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మల్దకల్ మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన బొప్పల స్వామి (30) మల్దకల్ మండల కేంద్రంలో మొబైల్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి షాప్ మూసివేసిన అనంతరం ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన పెద్దొడ్డికి బయలు దేరాడు.

గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం స్వామి ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న స్వామి ఆదివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.స్వామి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు . ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.