13 July, 2026 | 2:03 AM

ప్రతి కార్యకర్త పార్టీకి బలమైన సైనికుడు

13-07-2026 12:00 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు

కూకట్‌పల్లి, జులై 12 (విజయక్రాంతి): ప్రతి కార్యకర్త పార్టీకి బలమైన సైనికుడని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేలా సేవా కార్యక్రమాలని నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావు అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ఈ నూతన కార్యాలయం ద్వారా పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 

కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేసి భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యాలయం కేంద్ర బిందువుగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్, రంగారెడ్డి  అర్బన్ జిల్లా అధ్యక్షులు బిజెపి శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మాధవరం కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.