పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి
బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
చిట్యాల/ కట్టంగూర్, జులై 19 : పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం నకిరేకల్ మండల కేంద్రంలోని సువర్ణ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పై బూత్ స్థాయి పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు.
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదు లక్ష్యాలు మరియు బూత్ స్థాయి బలోపేతంపై ఆయన మార్గనిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, నకిరేకల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్చార్జి గుజ్జ దీపికా -యోగేంద్ర, మాజీ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, తదితర బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






